: డేరా సచ్ఛా సౌధా వివాదం భారత్ సమస్యలను బయటపెడుతోంది: చైనా మీడియా వ్యాఖ్య
ఇటీవల గుర్మీత్ సింగ్ అరెస్టు కారణంగా అతని అనుచరులు చేసిన హింసాకాండ భారత దేశ అంతర్గత సమస్యలను బట్టబయలు చేస్తోందని చైనా మీడియా వ్యాఖ్యానించింది. `పంజాబ్ అల్లర్లు భారత్ అంతర్గత వ్యవహరం. త్వరలోనే వాటిని ప్రభుత్వం సద్దుమణిగేలా చేస్తుందని చైనా భావిస్తోంది. ఒకవేళ అల్లర్లు పేట్రేగినా అక్కడి హింసాకాండను తగ్గించడానికి భారత్ చైనాతో ఉన్న డోక్లాం వివాదాన్ని కారణంగా చూపే అవకాశాలు కూడా ఉన్నాయి` అని గ్లోబల్ టైమ్స్ సంపాదకీయంలో ప్రచురించింది.
ఇలా అంతర్గత వివాదాలను, సరిహద్దు వివాదాలతో లింక్ చేయడంపై భారత్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అలాగే ఈ మధ్య డోక్లాం వివాదంపై కూడా భారత్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కానీ చైనా మాత్రం తన అధికారిక మీడియా ద్వారా భారత్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూనే ఉంటోంది. దేశంలో ఏ చిన్న పరిణామం చోటుచేసుకున్నా, ఏ దేశ ప్రతినిధి భారత్ విచ్చేసినా చైనా మీడియా తీవ్రంగా దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే.