: ఇటలీలో దోపిడీకి గురైన నా కుమారుడికి సాయం చేసేవారుంటే ఫోన్ చేయండి: ప్రముఖ నటి సుహాసిని వేడుకోలు.. అద్భుత స్పందన!


ప్రస్తుతం ఇటలీ పర్యటనలో ఉన్న తన కుమారుడు నందన్ ను గుర్తు తెలియని దొంగలు దోపిడీ చేశారని దర్శకుడు మణిరత్నం సతీమణి, నటి సుహాసిని తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. ఇటలీలోని వెనిస్ దగ్గర్లో ప్రస్తుతం నందన్ ఉన్నాడని, తెలిసిన వారు ఎవరైనా ఉంటే తన కుమారునికి సాయం చేయాలని ఆమె అభ్యర్థించారు.

"మా వాడు బెలున్నో ప్రాంతంలో ఉన్నప్పుడు దోపిడీకి గురయ్యాడు. ఎవరైనా వెనిస్ విమానాశ్రయం దగ్గర ఉంటే సాయం చేయండి. వెనిస్ లో ఉండి సాయం చేయలేని వారు మాత్రం నేను పోస్టు చేసిన ఫోన్ నంబర్ కు కాల్ చేయవద్దు. మా వాడి సెల్ ఫోన్ లో బ్యాటరీ చాలా తక్కువగా ఉంది. పదే పదే ఎవరైనా కాల్ చేస్తే కాంటాక్టు పోతుంది" అని తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఆ ట్వీట్ వైరల్ కాగా, ఎంతో మంది వెనిస్ లోని భారతీయులు నందన్ కు సాయపడేందుకు పోటీ పడ్డారు. ఆపై కాసేపటికి సుహాసిని మరో ట్వీట్ పెడుతూ, తన కుమారుడు క్షేమమని, ఓ హోటల్ లో దిగాడని చెబుతూ, సాయపడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని చెప్పారు.

  • Loading...

More Telugu News