: ఓట్ల లెక్కింపు సరళిని పరిశీలిస్తున్న శిల్పా, భూమా!
నంద్యాలలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కార్యక్రమం కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు కేంద్రానికి వైసీసీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి చేరుకున్నారు. ఓట్ల లెక్కింపు సరళిని ఇరువురు నేతలు పరిశీలిస్తున్నారు. కాగా, తమ గెలుపుపై శిల్పా, భూమా లు తమ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల ప్రజలు తమకే పట్టం కడతారంటూ ఆ ఇద్దరు నేతలు చెబుతున్నారు.