: చిన్న తప్పిదాల వల్ల ‘స్వర్ణం’ గెలవలేకపోయింది: పీవీ సింధు తండ్రి రమణ
ప్రపంచ ఛాంపియన్ షిప్ బ్యాడ్మింటన్ లో చిన్న తప్పిదాల వల్ల స్వర్ణం గెలవలేకపోయిందని పీవీ సింధు త్రండి రమణ అభిప్రాయపడ్డారు. ఈ టోర్నీలో సింధు రజతపతకంతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమణ మాట్లాడుతూ, ప్రపంచ ఛాంపియన్ షిప్ లో మొత్తంగా చూస్తే సింధు బాగా ఆడిందని, ప్రత్యర్థి ప్లేయర్ ఒకుహరతో హోరాహోరీగా పోరాడిందని అన్నారు. చిన్న తప్పిదాల కారణంగా సింధు సెకండ్ ప్లేస్ లో ఉంది, ఏదేమైనా, ముందుముందూ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని చెప్పారు. సింధు ఎటాకింగ్ గేమ్ ఆడలేదని, అలా ఎందుకు ఆడలేదన్న విషయం సింధు వచ్చిన తర్వాత తెలుస్తుందని అన్నారు.