: రానున్న నాలుగురోజుల్లో ఏపీలో వర్షాలు
రానున్న నాలుగురోజుల్లో ఏపీలో పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒడిశా తీరం ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో నిన్న అల్పపీడనం ఏర్పడిందని, ఇది అక్కడే సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనంతో కలిసి ఉందని చెప్పారు. ఈ అల్పపీడనం వైపుగా రుతుపవన ద్రోణి ఉందని, దీని ప్రభావంతో కోస్తాంధ్రలోని కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. రుతుపవన ద్రోణి అలాగే కొనసాగితే, వచ్చే నాలుగు రోజుల్లో ఏపీలో కొన్ని చోట్ల భారీగా, మరికొన్ని చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు చెప్పారు.