: నంద్యాల ఉపఎన్నిక కౌంటింగ్ తర్వాత వైసీపీలో ఎవరూ మిగలరు: టీడీపీ నేత ఆదినారాయణరెడ్డి


నంద్యాల ఉపఎన్నిక కౌంటింగ్ తర్వాత వైసీపీలో ఎవరూ మిగలరంటూ ఏపీ మంత్రి, టీడీపీ నేత ఆదినారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రేపు ఉదయం పది గంటల కల్లా తాము అనుకున్న మెజార్టీతో నంద్యాల ఉపఎన్నికలో గెలుపు ఖాయమని, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని అన్నారు. కాగా, రేపు ఉదయం 8 గంటలకు ఉపఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నంద్యాలలో ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే చట్టం 30 సహా 144 సెక్షన్ అమల్లో ఉన్నాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కవ్వింపు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్పీ గోపినాథ్ జెట్టి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News