: జైల్లో గుర్మీత్ సింగ్ కు మొదటిరోజు నిద్రపట్టలేదట!
తనను తాను దేవుడిగా ప్రకటించుకున్న డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ సింగ్ ను అత్యాచారం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చడం .. ఆ వెంటనే ఆయనను రోహ్ తక్ జిల్లా జైలుకు తరలించడం తెలిసిందే. అయితే, జైలులో ఉన్న గుర్మీత్ కు అతిథి మర్యాదలు చేస్తున్నారంటూ వచ్చిన వార్తలను సంబంధిత అధికారులు ఖండించారు. జైలులో గుర్మీత్ మొదటిరోజు అనుభవంపై విశ్వసనీయ వర్గాల సమచారం ప్రకారం, ఒక చపాతి, గ్లాసు పాలు మాత్రమే తీసుకున్న ఆయనకు నిద్రపట్టలేదట. దీంతో, ఒక గంటపాటు యోగా చేసిన గుర్మీత్ తెల్లవారుజామున 5 గంటలకు నిద్రపోయాడట.