: ఇక్కడ పెంచే పందులు రాజశేఖర్ రెడ్డివి కాదు!: బుచ్చయ్య చౌదరిపై రోజా మండిపాటు


కాకినాడలో పందుల బెడదకు, అపరిశుభ్ర వాతావరణానికి నాడు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డే కారణమని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యేను రోజాను ప్రశ్నించగా ఆమె తన దైన శైలిలో మండిపడ్డారు. కాకినాడ ఎన్నికల ప్రచారంలో ఉన్న రోజాను ఈ విషయమై ఓ న్యూస్ ఛానెల్  ప్రశ్నించగా..‘బుచ్చయ్యచౌదరి అవుట్ డేటెడ్ పొలిటీషియన్. వైసీపీ నుంచి టీడీపీలోకి తీసుకున్న నేతలకు మంత్రి పదవి ఇచ్చి..ఆయనకు పదవి ఇవ్వలేదని బుర్ర పిచ్చెక్కిపోయి చంద్రబాబునాయుడినే తిట్టాడు. ఎప్పుడేమి మాట్లాడతాడో ఆయనకే తెలియదు.

 రాజశేఖరరెడ్డిగారి హయాంలో వేసిన రోడ్లు, డ్రైనేజ్ లు, కట్టించిన ఇళ్లు తప్పా..ఇక్కడ కొత్తగా ఏమీ లేవు. పందుల వయసు ఎంతో కూడా తెలియని బుచ్చయ్యచౌదరి.. గుంపులు గుంపులుగా పందుల్లా వచ్చేసి మంత్రులు డబ్బులు పంచేసి ఇక్కడ ఎన్నికలు చేయాలని అనుకుంటున్నారే గానీ, ఇక్కడ పెంచే పందులు రాజశేఖరరెడ్డివి కాదు...ఆయన చనిపోయింది 2009లో.. ఇప్పుడు 2017. టీడీపీ వాళ్లకు పిచ్చి ఎంతగా ముదిరిందో ఈ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది’ అని రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

  • Loading...

More Telugu News