: కళ్లు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో వాళ్లిద్దరూ ఫస్ట్: వైసీపీ ఎమ్మెల్యే రోజా


కళ్లు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబునాయుడు, ఆయన కొడుకు లోకేశ్ ఫస్ట్ అంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. కాకినాడ నగర పాలక ఎన్నికల నేపథ్యంలో ఆమె ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ న్యూస్ ఛానెల్ తో ఆమె మాట్లాడుతూ, ‘కాకినాడలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ కచ్చితంగా సక్సెస్ కాబోతోంది. నిన్న చంద్రబాబునాయుడి మాటలు చూస్తే మీకే అర్థమవుతుంది. టీడీపీకి కాపులు ఓటు వెయ్యరు. పవన్ కల్యాణ్ గారు న్యూట్రల్ గా ఉన్నారు. కాపులందరికీ తానే న్యాయం చేసినట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వాలు కాపులకు అన్యాయం చేసినట్టు చంద్రబాబు చెబుతున్నారు. ప్రతి ఏటా కార్పొరేషన్ బడ్జెట్ లో కాపులకు వెయ్యికోట్లు కేటాయించామని చంద్రబాబు చెబుతున్నారు.

ఇదంతా అబద్ధం...కళ్లు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు, లోకేశ్ ఫస్ట్. చంద్రబాబుకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను! ఇప్పటికీ, నాలుగు బడ్జెట్ లు అయ్యాయి. నాలుగు వేల కోట్లు ఇచ్చి ఉండాలి. అది నిరూపిస్తే, రాజకీయాల నుంచి నేను శాశ్వతంగా తప్పుకుంటాను. అగ్రిగోల్డ్ లో పుల్లారావు, లోకేశ్ దోచుకున్నారు. వైసీపీ నేతలు దోచుకున్నారంటూ సిగ్గులేకుండా,పుల్లారావుగారు మాట్లాడుతున్నారు. మీకు దమ్మూధైర్యం ఉంటే సీబీఐ ఎంక్వయిరీ వేయండి. పుల్లారావు, లోకేశ్ ఎంత దోచుకున్నారో వాళ్లే లెక్కలు కక్కిస్తారు. అంతేగానీ, వైసీపీ నేతలపై బురదజల్లితే వదిలిపెట్టేది లేదు. ఈ రాష్ట్రంలో అత్యధిక సమయం పదమూడేళ్లు అధికారంలో ఉండి ఈ కాపులను రాచి రంపానపెట్టింది, నాశనం చేసింది ఎవరంటే చంద్రబాబునాయుడే. కాపులను అభివృద్ధి చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డిగారే. అందుకే, వైఎస్ బతికున్నంత కాలం ఆయనకు కాపులు తోడుగా ఉన్నారు’ అంటూ రోజా చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News