: డైరెక్టర్ రవికాంత్ తో ఘంటసాల మనవరాలి ప్రేమ వివాహం!
విఖ్యాత గాయకుడు, దివంగత ఘంటసాల వెంకటేశ్వరరావు మనవరాలు వీణ, 'క్షణం' చిత్ర దర్శకుడు రవికాంత్ ను ప్రేమ వివాహం చేసుకోనుంది. తన తండ్రి రత్నకుమార్ మాదిరిగానే డబ్బింగ్ ఆర్టిస్టుగా రాణిస్తున్న వీణ, గతంలో రవికాంత్ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఆదాశర్మకు డబ్బింగ్ చెప్పింది. ఆ సమయంలో రవికాంత్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారగా, ఇరు కుటుంబాల పెద్దలూ ఈ పెళ్లికి అంగీకరించారు. చెన్నైలో వీరిద్దరి నిశ్చితార్థం జరుగగా, నవంబర్ 11న వివాహం వైభవంగా జరగనుంది. వీరి వివాహానికి పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.