: రాజమహేంద్రవరంలో జగన్... ఘనస్వాగతం తరువాత భారీ కాన్వాయ్ తో కాకినాడకు పయనం


కాకినాడ నగర పాలక ఎన్నికల్లో వైకాపా అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించేందుకు ఈ ఉదయం రాజమహేంద్రవరం విమానాశ్రయానికి వచ్చిన వైఎస్ జగన్ ను తూర్పు గోదావరి జిల్లా పార్టీ శ్రేణులతో పాటు వైకాపా అభిమానులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన జగన్, భారీ కాన్వాయ్ తో సహా కాకినాడకు బయలుదేరారు.

ఈ ఎన్నికల్లో ప్రచారానికి నేటితో గడువు ముగియనున్న నేపథ్యంలో, రాజమహేంద్రవరంలో జగన్ ఎక్కువ సేపు గడపలేదు. తనను పలకరించేందుకు వచ్చిన పార్టీ నేతలతో సైతం జగన్ ఎక్కువ సేపు మాట్లాడలేదు. కాగా, మరికాసేపట్లో కాకినాడకు చేరుకునే జగన్, సాయంత్రం 5 గంటల వరకూ ప్రచారం నిర్వహించనున్నారు. జగన్ ప్రచారం సినిమా హాల్స్ రోడ్డు, కల్పనా సెంటర్ తదితర ప్రాంతాల్లో సాగనుంది.

  • Loading...

More Telugu News