: తెలుగు రాష్ట్రాలలో రేపు, ఎల్లుండి దంచికొట్టనున్న వర్షాలు!


ఈశాన్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో పాటు కోస్తాంధ్రపై ఆవరించిన ఆవర్తనం కలిసిన నేపథ్యంలో, రేపు, ఎల్లుండి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం ఒడిసా పరిసరాల్లో కేంద్రీకృతమై ఉన్న ఆవర్తనం, నేటి సాయంత్రానికి మరింతగా విస్తరిస్తుందని, దీని ప్రభావంతో సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఆపై అల్పపీడనం వాయుగుండంగా మారి, పశ్చిమ దిశగా పయనిస్తుందని, ఒడిసా, ఉత్తర కోస్తా, ఛత్తీస్ గఢ్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, విదర్భ రాష్ట్రాల్లో సైతం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.

మరోవైపు బిహార్‌ నుంచి ఉత్తర కోస్తా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుండగా, ఈ రెండింటి ప్రభావంతో ఇప్పటికే తెలంగాణ, ఏపీల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా కరీంనగర్, నిజామాబాద్ తదితర పలు ప్రాంతాల్లో గత రాత్రి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. వచ్చే 24 గంటల్లో తెలంగాణలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News