: నేడు మాత్రం ప్రయోగాలు వద్దు... కోహ్లీ మనసులోని మాట!


నేడు శ్రీలంకతో జరగనున్న మూడో వన్డేలో గెలిచి, సిరీస్ ను గెలుచుకోవడమే లక్ష్యంగా విరాట్ కోహ్లీ సేన సిద్ధమైంది. లంక పర్యటనలో భాగంగా ఇప్పటికే టెస్టు సిరీస్ ను గెలుచుకున్న భారత జట్టు, ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో 2-0 ఆధిక్యంతో ఉన్న సంగతి తెలిసిందే. ఇక మూడో వన్డే నేడు జరగనుండగా, ఈ మ్యాచ్ లోనే గెలిచి, సిరీస్ ను సొంతం చేసుకునే లక్ష్యంతో కోహ్లీ సాగుతున్నాడు. ఈ మ్యాచ్ గెలిచిన తరువాతనే రిజర్వ్ బెంచ్ లో ఉన్న ఆటగాళ్లకు అవకాశం కల్పించి ప్రయోగాలు చేయాలని ఆయన మనసులో ఉంది.

ఇదే విషయాన్ని ప్రాక్టీస్ అనంతరం మీడియాకు చెప్పిన కోహ్లీ, తాము ఎటువంటి ప్రయోగాలూ నేడు చేయబోవడం లేదని అన్నాడు. పూర్తి జట్టుతో రంగంలోకి దిగనున్నామని చెప్పాడు. వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో టాస్ కీలకం కానుందని చెప్పిన కోహ్లీ, భారత జట్టు టాస్ గెలిస్తే, అప్పటి పరిస్థితులను అనుసరించి బ్యాటింగ్ చేయాలా? లేక ఫీల్డింగ్ చేయాలా? అన్న విషయాన్ని నిర్ణయిస్తామని చెప్పాడు. కాగా, ఈ మ్యాచ్ నేడు 2.30 గంటలకు పల్లెకల మైదానంలో జరుగనుండగా, రెండో మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ పై వేటు పడటం లంకేయులకు మైనస్ పాయింట్.

  • Loading...

More Telugu News