: వెంకయ్య 'డ్రెస్-అడ్రెస్' చమత్కారం గురించి వివరించిన గవర్నర్ నరసింహన్!
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి ఈ రోజు అమరావతిలో పౌర సన్మానం జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ తనకి, వెంకయ్య నాయుడికి మధ్య జరిగిన ఓ సంభాషణను వివరించారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన నేపథ్యంలో డ్రెస్ మార్చుకుంటారా? అని తాను వెంకయ్య నాయుడిని అడిగానని చెప్పారు. దానికి ఆయన డ్రెస్ మార్చుకోలేను కానీ అడ్రెస్ మార్చుకున్నానని చెప్పారని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో వెంకయ్య చాలా కృషి చేశారని గవర్నర్ వ్యాఖ్యానించారు. ఆయన ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తని అన్నారు. ఆయనలోని హాస్యచతురతను నరసింహన్ కొనియాడారు.