: గ్రామరాజ్యం లేనిదే రామరాజ్యం అసంపూర్ణం: వెంకయ్యనాయుడు


ప్రతి పల్లెటూరుకి రోడ్డు ఉండాలనేది తనకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక అని... గ్రామాలకు రోడ్లు లేకపోతే ఇతర ప్రాంతాలతో అనుసంధానం ఉండదని, దీంతో గ్రామాభివృద్ధి ఆగిపోతుందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ విషయాన్ని ఏన్నో ఏళ్ల కిందటే తాను పార్లమెంటులో ప్రస్తావించానని, కానీ అప్పట్లో తాను చెప్పిన విషయం చాలా మందికి అర్థం కాలేదని ఆయన తెలిపారు. దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని... గ్రామరాజ్యం లేకపోతే రామరాజ్యం అసంపూర్ణమని చెప్పారు.

ప్రజలకు అత్యవసరమైన రెండోది ఇల్లు అని అన్నారు. ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉండే మన దేశంలో ప్రతి ఒక్కరికీ ఇంటిని ఏర్పాటు చేయడం సాధ్యమేనా అని అందరూ భావించేవారని... తన అదృష్టం వల్ల మోదీ కేబినెట్ లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా దేశంలో లక్షలాది ఇళ్లను నిర్మించడానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. దేశం మొత్తానికి 26 లక్షల ఇళ్లు మంజూరైతే, ఒక్క ఏపీకే 5 లక్షల 35వేల ఇళ్లు వచ్చాయని తెలిపారు. అమరావతిలో నిర్వహించిన పౌరసన్మానం కార్యక్రమంలో ప్రసంగిస్తూ వెంకయ్య ఈ విధంగా స్పందించారు. 

  • Loading...

More Telugu News