: వీహెచ్‌కి ముద్దు పెడుతున్న ఆర్జీవీ... వైరల్ అవుతున్న ఫొటో
`అర్జున్ రెడ్డి` సినిమాకు సంబంధించి ముద్దు పోస్టర్ల విషయంలో వీహెచ్, రామ్‌గోపాల్ వర్మలకు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వీహెచ్‌కి ఆర్జీవీ ముద్దు పెడుతున్నట్లుగా ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. గతంలో దర్శకుడు అనురాగ్ కశ్యప్‌కు ముద్దు పెడుతున్న ఫొటో ఒకదాన్ని ఆర్జీవీ ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. అదే ఫొటోలో అనురాగ్ స్థానంలో వీహెచ్ ముఖాన్ని ఎవరో నెటిజన్ మార్ఫింగ్ చేశాడు. దీంతో వీహెచ్ బుగ్గపై ఆర్జీవీ ముద్దు పెడుతున్నట్లు ఫొటో తయారైంది.
ఈ ఫొటోను ఆర్జీవీ ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. `బాహుబలి చిత్రానికి పనిచేసిన 27 మంది కంప్యూటర్ నిపుణులు కలిసి నేను వీహెచ్ బుగ్గపై ముద్దు పెడుతున్నట్లుగా చేయవచ్చు. కానీ అవతార్ సినిమా దర్శకుడు జేమ్స్ కేమెరూన్ తలచుకున్నా నాతో వీహెచ్ పెదాలపై ముద్దు పెట్టించలేడు` అని ఆర్జీవీ పోస్ట్ రాశాడు. అలాగే `అర్జున్ రెడ్డి` సినిమా చూసి హీరో విజయ్ దేవరకొండను పొగుడుతూ ఆర్జీవీ ఫేస్‌బుక్‌లో పెద్ద పోస్ట్ పెట్టాడు. దీనికి విజయ్ స్పందిస్తూ - `హనుమంతరావును మీరు కిస్ చేశారో లేదో తెలియదు కానీ, మిమ్మల్ని కలిసినపుడు నేను కచ్చితంగా కిస్ చేస్తాను` అన్నాడు.