: బంజారాహిల్స్లో అర్ధరాత్రి కారు బీభత్సం.. మద్యం మత్తులో కారు నడిపిన యువతి.. నంబరు ప్లేటు తొలగించి పరారీ!
హైదరాబాద్, బంజారాహిల్స్లో గురువారం అర్ధరాత్రి బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో యువతి కారు నడపడంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే కిందికి దిగిన వ్యక్తులు కారు నెంబరు ప్లేటు తొలగించి అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు కారులోంచి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు ఎవరిదన్న విషయమై ఆరా తీస్తున్నారు. సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.