: సర్కస్ జరుగుతుండగా శిక్షకుడిపై దాడి చేసిన పులి... వీడియో చూడండి
వరుస ప్రదర్శనల వల్ల అలసటకు గురైన పులి ఒక్కసారిగా తన శిక్షకుడిపై విరుచుకుపడింది. అతనిపై దాడి చేసి, స్టేజీ చుట్టూ లాక్కెళ్లిన ఘటన చైనాలోని యింగ్‌కౌ సిటీలో జరిగింది. ప్రదర్శన జరుగుతుండగానే ఈ సంఘటన జరగడంతో ముందు వరుసలో కూర్చున్న ప్రేక్షకులు కంగుతిన్నారు. వారిలో ఒకరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇద్దరు శిక్షకులు కలిసి పులిని ఆడిస్తుండగా, అందులో ఒక శిక్షకుడిపై పులి దాడి చేసింది. మరో శిక్షకుడు కర్రతో ఎంత కొడుతున్నా పులి అతన్ని విడిచి పెట్టలేదు. తర్వాత కాసేపటికి అతన్ని వదిలింది. దాడికి గురైన వ్యక్తి క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. పది రోజుల నుంచి రోజుకి మూడు సార్లు పులితో ప్రదర్శన చేయించడం వల్ల అది అలసటకు గురై దాడి చేసుండొచ్చని సర్కస్ యాజమాన్యం తెలిపింది.