: పూజలో ప్లాస్టిక్ వస్తువులు ఉపయోగించకండి.. మన భూమికి మంచిది కాదు: రేణూ దేశాయ్
వినాయక చవితి సందర్భంగా సినీ నటుడు పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ తన ఇంట్లో పూజలు చేసింది. ఈ సందర్భంగా తీసిన ఓ ఫొటోను పోస్ట్ చేసి, ఓ సందేశం ఇచ్చింది. పూజ కోసం, డెకరేషన్ కోసం ప్లాస్టిక్ వస్తువులు వాడకూడదని కోరింది. ఆ వస్తువులు భూ కాలుష్యానికి కారణమవుతాయని చెప్పింది. ఆమె ఇచ్చిన సందేశం నెటిజన్లకు బాగా నచ్చేస్తోంది.
‘మంచి మాటను ఒక మంచి మనిషి చెప్తే ఎందుకు వినకుండా ఉంటాం మేడమ్..! తప్పకుండా మీరు చెప్పినట్టే ప్లాస్టిక్ వినియోగించం మేడం. జై హింద్’ అని కామెంట్లు పెడుతున్నారు. ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే రేణూ దేశాయ్ తనకు సంబంధించిన ఏ విషయమైనా అభిమానులతో పంచుకుంటుంది. భావోద్వేగం, సంతోషంలో ఉన్నప్పుడు అందుకు తగ్గ కవితను రాసుకొని, వాటిని ట్విట్టర్‌లో పోస్టు చేస్తుంది.