: గుర్మీత్‌సింగ్ వ్యవహారంపై హైకోర్టు సీరియస్.. కఠినంగా వ్యవహరించాలంటూ హరియాణా ప్రభుత్వానికి ఆదేశాలు
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు గుర్మీత్‌సింగ్ వ్యవహారంపై పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన విషయంలో కఠినంగా వ్యవహరించాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ నాయకులు కనుక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కేసులు పెట్టాలని సూచించింది. అవసరమైతే కేంద్రం నుంచి మరిన్ని బలగాలను తెప్పించుకోవాలని సూచించింది. మరోవైపు ఈ మధ్యాహ్నం 2:30 గంటలకు గుర్మీత్‌పై పంచ్‌కుల సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనుంది. కోర్టు తీర్పు సందర్భంగా పంజాబ్, హరియాణాలో హై అలెర్ట్ ప్రకటించారు. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. మరోవైపు కోర్టు తీర్పు నేపథ్యంలో గుర్మీత్ మద్దతుదారులు వేలాదిమంది పంచ్‌కుల చేరుకున్నారు.