: ఆల‌స్యంగా వ‌చ్చినందుకు మిథాలీని క్ష‌మాప‌ణ‌లు అడిగిన షారుక్‌!


బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఓ కార్య‌క్ర‌మానికి ఆల‌స్యంగా హాజ‌రై, భార‌త మ‌హిళా జ‌ట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌ను ఎదురుచూసేలా చేసినందుకు ఆమెకు క్ష‌మాప‌ణ‌లు తెలిపారు. 'ఛేంజింగ్ రిలేషన్ షిప్స్‌` పేరుతో మానవ సంబంధాల్లో వస్తున్న మార్పులపై `టెడ్ టాక్` కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో షారూక్ ఖాన్ తో పాటు దర్శకుడు కరణ్ జోహార్, మిథాలీ రాజ్‌లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి షారుక్‌, క‌ర‌ణ్‌లు చాలా ఆల‌స్యంగా వచ్చారు. దీంతో వీరిద్దరి కోసం కార్య‌క్ర‌మ నిర్వాహ‌కులు మిథాలీని దాదాపు మూడు గంటల పాటు వెయిట్ చేయించారు. అలా ఎదురుచూసేలా చేసినందుకు షారూక్, వచ్చీ రాగానే మిథాలీ దగ్గరకు వెళ్లి క్షమించమని అడిగి, ఆల‌స్యంగా రావ‌డానికి గ‌ల కార‌ణాల‌ను వివరించిన‌ట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News