: నంద్యాల ఉప ఎన్నిక ఎగ్జిట్ ఫలితాలు వెల్లడించిన వెబ్‌న్యూస్ చానల్‌పై కేసు
ఎన్నికల సంఘం నిబంధనలను అతిక్రమించి నంద్యాల ఉప ఎన్నికపై ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన ఓ వెబ్ న్యూస్ చానల్‌పై కేసు నమోదైంది. ఈ మేరకు నంద్యాల పట్టణంలోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. ఉప ఎన్నిక ఎగ్జిట్ ఫలితాలను సదరు వెబ్ న్యూస్ చానల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. కాగా, లగడపాటి రాజగోపాల్‌కు చెందిన ఫ్లాష్ టీం నిర్వహించిన సర్వేలో నంద్యాలలో టీడీపీ గెలవబోతోందని తేలింది.