: యువత ప్రాణాలతో ‘బ్లూ వేల్’ చెలగాటమాడుతోంది: ఒడిశా డీజీపీ


యువత ప్రాణాలతో ‘బ్లూ వేల్’ గేమ్ చెలగాట మాడుతోందని ఒడిశా రాష్ట్ర డీజీపీ కన్వర్ బ్రజేష్ సింగ్ అన్నారు. ఈ రోజు భువనేశ్వర్ లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బ్లూవేల్ గేమ్ లింక్స్ ను సోషల్ మీడియాలో అందుబాటులో లేకుండా చూడాలని ఆయన అన్నారు. చిన్న చిన్న సవాళ్లతో ప్రారంభమయ్యే ఈ ఆట, ఆడేవారి ప్రాణాలను తీసే దిశగా వెళుతుందని అన్నారు. కాగా, ఈ గేమ్ కారణంగానే సంబల్ పూర్ పట్టణానికి చెందిన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. విదేశాల్లో అయితే రష్యాలో 130 మంది, అమెరికాలో ఇద్దరు టీనేజర్లు ప్రాణాలు విడిచాడు. 

  • Loading...

More Telugu News