: ‘లిప్ లాక్’పై ఎవరి అభిప్రాయం వారిది..అందరి అభిప్రాయాలను గౌరవిస్తాను: హీరో విజయ్ దేవరకొండ


అర్జున్ రెడ్డి సినిమా పోస్టర్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అభ్యంతరం వ్యక్తం చేయడం, ఆయన వ్యాఖ్యలను హీరో విజయ్ దేవరకొండ ఖండించడం, ఆ ఖండనకు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మద్దతు తెలపడం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తనను పలకరించిన ఓ న్యూస్ ఛానెల్ తో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, ‘లిప్ లాక్ పై ప్రతి ఒక్కరికీ ఒక అభిప్రాయం ఉంటుంది..వారి అభిప్రాయాలను నేను గౌరవిస్తాను. నా మటుకు నాకు దీనిని సమర్థిస్తాను. అందుకే, లిప్ లాక్ సీన్లను ఈ చిత్రంలో ఉంచాం. ఈ సీన్లపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా చూస్తే ఆ సీన్స్ అవశ్యకత ఏంటో తెలుస్తుంది... ఈ సినిమా ద్వారా మద్యం తాగమని, డ్రగ్స్ తీసుకోమని మేము చెప్పటంలేదు. ఆ పాత్రదారి ఆ అలవాట్లకు ఎందుకు బానిసయ్యాడనే విషయాన్ని మాత్రమే ఈ సినిమాలో చూపించాం. పోస్టర్ల ద్వారా ఆ పాత్రదారి క్యారెక్టర్ ను మేము తెలియజేశాం’ అని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News