: అభిరుచి మధుకి నేర చరిత్ర ఉంది: శిల్పా చక్రపాణిరెడ్డి
నంద్యాలలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య జరిగిన ఘటనపై శిల్పా చక్రపాణిరెడ్డి స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేర చరిత్ర కారణంగా అప్పటి పార్టీ ఆదేశాల మేరకే నాడు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న మధును సస్పెండ్ చేశామని, ఆ అక్కసుతోనే ఈ రోజు తనపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. నంద్యాల ఉపఎన్నిక పోలింగ్ రోజున కావాలనే తనతో గొడవ పెట్టుకున్నారని, ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడినా తాము సహనంగా ఉన్నామని అన్నారు. నంద్యాల శాంతియుతంగా ఉండాలన్నదే తమ కోరిక అని, తమపై కేసులు పెట్టి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.