: జైల్లో ఆత్మహత్యాయత్నం చేసిన లేడీ డాన్ సంగీత


చిత్తూరు సబ్ జైల్లో ఉన్న ఎర్ర చందనం స్మగ్లర్, లేడీ డాన్ సంగీత ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళ్తే, కోల్ కతాకు చెందిన మోడల్ సంగీతా ఛటర్జీపై నాలుగు ఎర్ర చందనం కేసులు ఉన్నాయి. వీటిపై విచారణ కొనసాగుతోంది. సబ్ జైల్లో ఉన్న ఆమె బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ... ఆమెకు బెయిల్ మంజూరు కావడం లేదు.

 ఈ నేపథ్యంలో, తనకు బెయిల్ రాదనే భావనతో ఆమె తీవ్ర నిరాశకు గురైంది. ఈ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సబ్ జైల్లో ఉన్న ఒక క్రిమిసంహారక మందును తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను జైలు సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్సను అందించి, ప్రాణాపాయం నుంచి తప్పించారు.

  • Loading...

More Telugu News