: ఏమిటీ, నన్ను హైద‌రాబాద్ లో అడుగుపెట్టనివ్వరా?.. నేను ఇక్కడే ఉన్నాను సారూ: రామ్ గోపాల్ వ‌ర్మ‌


విజయ్ దేవరకొండ హీరోగా నటించిన‌ ‘అర్జున్ రెడ్డి’ సినిమా టైటిల్‌, పోస్ట‌ర్ల‌పై వివాదం కొన‌సాగుతూనే ఉంది. అయితే, ఈ సినిమాతో ఎటువంటి సంబంధం లేనివారు ఈ సినిమా గురించి గొడ‌వ‌ప‌డుతున్నారు. ఈ సినిమా పోస్ట‌ర్ల‌ను కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీ హ‌నుమంత‌రావు చించేసిన నేప‌థ్యంలో ఆయ‌న‌పై ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ వ్యంగ్యంగా వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే.

 దానికి హ‌నుమంత‌రావు స‌మాధానం ఇస్తూ ఆర్‌జీవీపై మండిప‌డ్డారు. ఈ క్ర‌మంలో ముంబై లో ఉండి ఏదిప‌డితే అది మాట్లాడ‌డం స‌రికాదని, ఈ సారి హైద‌రాబాద్ లో ఎలా అడుగు పెడ‌తావో చూస్తా అంటూ రామ్ గోపాల్ వర్మపై వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కూడా రామ్‌గోపాల్ వ‌ర్మ సెటైర్ వేశాడు. ‘సర్... మీరు నన్ను హైద‌రాబాద్ లో అడుగుపెట్ట‌నివ్వ‌రా? ప్ర‌స్తుతం నేను హైద‌రాబాద్‌లోనే ఉన్నా’నంటూ న‌వ్వుతూ ఉన్న ఎమోజీలను పెట్టాడు వ‌ర్మ‌.  

  • Loading...

More Telugu News