: తన ప్రేమను నిరాకరించిందని.. నడిరోడ్డుపై బాలికపై కత్తితో దాడి చేసిన యువకుడు!
తన ప్రేమను నిరాకరిస్తోందని ఓ తొమ్మిదవ తరగతి విద్యార్థినిపై ఓ యువకుడు దాడి చేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లోని లఖింపూర్ ఖెరి ప్రాంతంలో నడిరోడ్డుపై చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. తన వెంట పడుతున్న యువకుడిని ఆ బాలిక హెచ్చరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ యువకుడు కత్తితో ఆ బాలిక చేతిని నరికాడు. రక్తపు మడుగులో ఉన్న ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేశారు. ఆసుపత్రిలో బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.