: చంద్రబాబుపై జగన్ కి వ్యక్తిగత వైరం లేదు.. ఉన్నది రాజకీయ వైరమే!: శిల్పా మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేసు పెట్టడం ఏంటని వైసీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. జగన్ మీద పెట్టిన కేసు విషయంలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఉపన్యాసం ఇచ్చే క్రమంలో జగన్ అలా ఏదో ఫ్లోలో అన్నారని చెప్పారు. చంద్రబాబుపై జగన్ కి వ్యక్తిగత వైరం లేదని, ఉన్నది రాజకీయ వైరమేనని వ్యాఖ్యానించారు. సీఎంను కాల్చండని జగన్ ఎక్కడా అనలేదని, కాల్చి చంపినా తప్పులేదని ఫ్లోలో అన్నారని చెప్పారు. జగన్‌పై కూడా టీడీపీ నేతలు అలాంటి వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు.