: ఈసీ ఫిర్యాదుతో ‘సాక్షి’ ఛానెల్ పై కేసు నమోదు


సాక్షి ఛానెల్ పై హైదరాబాద్ లోని సీసీఎస్ పోలీసులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ ఫిర్యాదు చేశారు. నంద్యాల ఉపఎన్నికల నేపథ్యంలో సర్వే పేరిట వార్తలు ‘సాక్షి’లో నిన్న ప్రసారం చేశారని ఆ ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’పై ఎన్నికల చట్టం 126 ఏ, బీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, నంద్యాల ప్రచారంలో సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ జగన్ పై ఈసీ ఆదేశాల మేరకు కేసు నమోదైంది. ఐపీసీ 188, 504, 506 సెక్షన్లు, ప్రజాప్రాతినిధ్యచట్టం 125 ప్రకారం నంద్యాల మూడో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News