: మళ్లీ బ్యాట్ పట్టనున్న సెహ్వాగ్!
అవును, భారత క్రికెట్ మాజీ ఓపెనర్, విధ్వంసకర బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి బ్యాట్ పట్టబోతున్నాడు. డిసెంబర్ 21 నుంచి 24 మధ్య యూఏఈలోని షార్జాలో టీ10 లీగ్ జరగనుంది. ఈ టోర్నీలో సెహ్వాగ్ తన విశ్వరూపాన్ని మరోసారి ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాడు. సెహ్వాగ్, అఫ్రిదీ, క్రిస్ గేల్, సంగక్కర తదితర ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొనబోతున్నారు. మరాఠాస్, పంజాబీస్, బంగ్లాస్, లంకన్స్, సింధీస్, ఫఖ్తూన్స్, కేరళిటీస్ జట్లు ఈ టోర్నీలో ఆడనున్నాయి. టీ20 తరహాలోనే టీ10 మ్యాచులు కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే.