: మహిళా రిపోర్టర్‌పైకి పాకిన బొద్దింక.. వణికిపోయిన జర్నలిస్ట్.. మీరూ చూడండి!
అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఓ మహిళా రిపోర్టర్ పైకి ఓ బొద్దింక పాకింది. దీంతో ఆమె భయపడిపోయి అరిచేసింది. ఆ బొద్దింకను కిందకు నెట్టేసిన తరువాత కూడా ఆమె ముఖంలో ఆ భయం కనిపించింది. లైవ్ ఇవ్వడానికి కొన్ని క్షణాల ముందే ఇలా జరగడం గమనార్హం. ఈ వీడియోను ఆ న్యూస్ ఛానెల్ ప్రతినిధులు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అదే లైవ్‌లో ఉన్నప్పుడు ఆ బొద్దింక పాకితే పరిస్థితి మరోలా ఉండేదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కేటీఎల్ఏ న్యూస్‌కు చెందిన సదరు రిపోర్టర్ మేరీ బెత్ మెక్‌డేడ్ ఆ భయానికి తాను లైవ్‌లో చెప్పాలనుకున్న విషయాన్ని మర్చిపోయింది.