: అనుచరులతో కలసి పోలింగ్ బూత్ లోకి వెళ్లేందుకు యత్నించిన శిల్పా మోహన్ రెడ్డి.. అడ్డుకున్న పోలీసులు!
నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగానే జరుగుతోంది. టీడీపీ, వైసీపీలకు చెందిన అభ్యర్థులు, కుటుంబీకులు, అనుచరులు పోలింగ్ బూత్ ల వద్ద జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో, నంద్యాల బస్టాండ్ వద్ద ఉన్న బాలికల పాఠశాలలోని పోలింగ్ బూత్ లోకి తన అనుచరులతో కలసి వెళ్లడానికి వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి యత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. కేవలం అభ్యర్థిని మాత్రమే లోపలకు అనుమతిస్తామని... అనుచరులను లోపలకు పంపించే ప్రసక్తే లేదని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో శిల్పా మోహన్ రెడ్డి మాత్రమే లోపలకు వెళ్లి, పోలింగ్ సరళిని పరిశీలించి, బయటకు వచ్చారు.