: ‘నన్ను పెళ్లిచేసుకోవా’ అంటూ అమ్మాయిలు మెసేజ్‌లు పెడుతున్నారు: యువ నటుడు రాజ్‌కుమార్‌ రావ్‌


బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న యువ‌ న‌టుడు రాజ్‌కుమార్‌ రావ్‌ను చాలా మంది అమ్మాయిలు త‌మ‌ను పెళ్లి చేసుకోవాలని అడుగుతున్నార‌ట‌. ఆయ‌న తాజా చిత్రం ‘బరైలీ కీ బర్ఫీ’ మంచి విజ‌యం సొంతం చేసుకున్న నేప‌థ్యంలో ఆ సినిమా చూసిన అమ్మాయిలంతా సామాజిక మాధ్య‌మాల్లో ఇలాంటి మెసేజ్‌లు పెడుతున్నారని ఆయ‌న చెప్పుకొచ్చాడు. తాను మాత్రం నటి పాత్రలేఖతో ప్రేమ‌లో ఉన్నాన‌ని, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోలేన‌ని ఈ కుర్ర హీరో అంటున్నాడు. కెరీర్‌లో మంచి ఊపు మీదున్న ఈ న‌టుడు ప్రస్తుతం ‘బోస్‌- డెడ్‌/ఎలైవ్‌’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు.  

  • Loading...

More Telugu News