: న్యూఢిల్లీ వేదికగా ట్రాన్స్‌జెండర్లకు అందాల పోటీలు
లింగమార్పిడి ద్వారా మహిళలుగా మారిన ట్రాన్స్‌జెండర్ల అందాల పోటీలు ఆగస్టు 27న న్యూఢిల్లీలో జరగనున్నాయి. `మిస్ ట్రాన్స్‌క్వీన్ ఇండియా 2017` పేరుతో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 16 మంది పార్టిసిపెంట్లు పాల్గొననున్నారు. ఈ పోటీలో గెలిచిన వారు వచ్చే ఏడాది థాయ్‌లాండ్‌లో జరగనున్న `మిస్ ఇంటర్నేషనల్ ట్రాన్స్‌క్వీన్` పోటీలో భారత్ తరఫున పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ట్రాన్స్‌జెండర్లలో ఉండే న్యూనతా భావాన్ని తగ్గించడానికి ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయని, వారు టీవీ, మోడలింగ్, సినిమా రంగాల్లో కూడా రాణించడానికి అందాల పోటీలు సహాయపడతాయని పోటీ నిర్వాహకురాలు రీనా రాయ్ తెలిపారు. 1500కు పైగా ట్రాన్స్‌మహిళలను ఆడిషన్ చేసి, వారిలో కొంత మందిని ఎంపిక చేసుకుని, అందాల పోటీలకు సంబంధించిన శిక్షణ ఇచ్చారు. వారిలో ఉత్తమంగా నిలిచిన 16 మంది ఈ పోటీలో పాల్గొంటున్నారు. ఈ పోటీలో గెలిచిన వారికి మిస్ ట్రాన్స్‌సెక్సువల్ ఆస్ట్రేలియా ఇంటర్నేషనల్ 2017 విజేతగా నిలిచిన లేటికా ఫిలిసియా రవీనా చేతుల మీదుగా కిరీటం ధరింపజేయనున్నారు.