: లిప్ లాక్ పోస్టర్లను ఉపసంహరించుకున్న 'అర్జున్ రెడ్డి'!


'పెళ్లిచూపులు' ఫేమ్ విజయ్‌ దేవరకొండ నటించిన ‘అర్జున్‌ రెడ్డి’ విడుదలకు ముందు కావాల్సినంత ప్రచారం సొంతం చేసుకుంది. సినిమాలోని లిప్ లాక్ ముద్దుల దృశ్యాల పోస్టర్లపై సంచలన వ్యాఖ్యలు, రాంగోపాల్ వర్మ ట్వీట్ల సందడి, వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేయడం.. ఈ సినిమాకు ఇప్పటికే అద్భుతమైన ప్రచారం వచ్చింది.

కాగా, వీహెచ్ ఆగ్రహం అనంతరం రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలతో ఆగ్రహించిన మహిళా సంఘాలు ఈ పోస్టర్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని లిప్ లాక్ లకు సంబంధించిన పోస్టర్లను ఉపసంహరించుకున్నట్టు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా, నిర్మాత ప్రణయ్‌ రెడ్డి వంగా తెలిపారు. మహిళలను గౌరవిస్తూ ఏపీ, తెలంగాణాల్లో ఏర్పాటు చేసిన ఈ సినిమా పోస్టర్లను తీసేసినట్టు తెలిపారు. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

  • Loading...

More Telugu News