: ‘భారత్ యాత్ర’ చేపట్టనున్నట్లు ప్రకటించిన నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కైలాశ్ సత్యార్థి
నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాశ్ సత్యార్థి వచ్చేనెల 11వ తేదీ నుంచి భారత్ యాత్ర చేపడతానని ప్రకటించారు. దేశంలో బాలల అక్రమ రవాణా, చిన్నారులపై వేధింపులు వంటి వాటిని పూర్తిగా అరికట్టడానికి పాటు పడాలని చెబుతూ తాను ఈ యాత్రను కొనసాగిస్తానని చెప్పారు. తన యాత్ర తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. దాదాపు 35 రోజులు కొనసాగనున్న ఆయన యాత్ర అక్టోబర్ 15న ఢిల్లీలో ముగుస్తుంది. దేశంలో 22 రాష్ట్రాల్లో ఆయన పర్యటిస్తారు. కైలాశ్ సత్యార్థి తీసుకున్న నిర్ణయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ స్వాగతించారు.