: సంప్ర‌దాయ దుస్తుల్లో ప‌రుగుపందెంలో పాల్గొన్న మార‌థానీర్లు


సాధార‌ణంగా ప‌రుగుపందేల్లో ట్రాక్ సూట్లు, బూట్లు వేసుకుని ప‌రిగెత్తే క్రీడాకారుల‌ను చూస్తుంటాం. అందుకు భిన్నంగా భార‌త సంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ అయిన చీర‌క‌ట్టు, ధోవ‌తుల్లో ప‌రుగు పందెం పూర్తి చేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. చీర‌క‌ట్టులో జ‌యంతి సంప‌త్ కుమార్‌, ధోవ‌తిలో ఉద‌య్‌ భాస్క‌ర్ దండ‌మూడిలు పాల్గొన్నారు. ఉద‌య్ ర‌న్నింగ్ షూస్ ధ‌రించ‌గా, జ‌యంతి మాత్రం కేవ‌లం సాండ‌ల్స్ మాత్రం ధ‌రించి పందెంలో పాల్గొంది.

నిజానికి ఆమె వ‌ట్టిపాదాల‌తో ప‌రిగెత్తేందుకు సిద్ధ‌ప‌డింది, కానీ ట్రాక్ మీద రాళ్లుర‌ప్ప‌లు ఉండ‌టంతో సాండ‌ల్స్‌తో పాల్గొన్న‌ట్లు ఆమె తెలిపారు. చేనేత వ‌స్త్రాల వాడ‌కానికి మ‌ద్ద‌తు తెలియ‌జేయ‌డానికే తాము ఇలా ప‌రుగుపందెంలో పాల్గొన్న‌ట్లు వారు చెప్పారు. 20,000 మంది పాల్గొన్న ఈ మార‌థాన్‌లో 42 కి.మీ.లు ప‌రిగెత్తి చీర‌క‌ట్టు, ధోవ‌తిలో పూర్తిచేసిన క్రీడాకారులుగా వీరు నిలిచారు. త్వ‌ర‌లోనే ఈ వ‌స్త్ర‌ధార‌ణ‌తో సైక్లింగ్ పోటీ కూడా పూర్తి చేయ‌బోతున్న‌ట్లు వారు తెలిపారు.

  • Loading...

More Telugu News