: చిరంజీవి కొత్త చిత్రం టైటిల్ పై అప్పుడే వివాదం... ఉయ్యాలవాడ వారసుల ఆగ్రహం!


చిరంజీవి 151వ చిత్రం 'సైరా' పేరు అధికారికంగా విడుదలైన నిమిషాల వ్యవధిలోనే ఓ వివాదం మొదలైంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో చిత్రం తీస్తూ, ఆయన పేరును పెట్టకుండా 'సైరా' అనే పేరును విడుదల చేయడంపై ఉయ్యాలవాడ వంశస్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిత్రం టైటిల్ పై తమకు అభ్యంతరాలు ఉన్నాయని, దీనిపై ఫిర్యాదు చేస్తామని రాయలసీమలో ఇప్పటికీ ఉన్న ఉయ్యాలవాడ వారసులు వ్యాఖ్యానించారు. వెంటనే చిత్ర టైటిల్ ను మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై మరింత సమాచారం వెలువడాల్సి వుంది.

  • Loading...

More Telugu News