: శశికళకు షాక్... ఒకవైపు విచారణ...రెండో వైపు పార్టీ బహిష్కరణ!


శశికళకు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఆర్థిక నేరాల కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ వీవీఐపీ సౌకర్యాలు పొందుతోందన్న ఆరోపణల నేపథ్యంలో విచారణ ముమ్మరమైంది. ఈ మేరకు వేసిన కమిషన్ కు శశికళ షాపింగ్ కు వెళ్లి వచ్చిన ఘటనకు సంబంధించిన సీసీ పుటేజ్ దృశ్యాలను ఐపీఎస్ అధికారిణి రూప అందజేశారు. ఇవి మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు, వారం రోజులపాటు రిసార్టులో ఉంచిన ఎమ్మెల్యేల సాక్షిగా ఆమెను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల తరువాతి వరకు ఆమెకు శిక్ష అమలైతే ఆమె రాజకీయ భవిష్యత్తుకు ఇంచుమించు దారులు మూసుకుపోయినట్టేనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు విచారణలో శశికళకు వీవీఐపీ సౌకర్యాలు అందజేశారని నిర్ధారణ అయితే ఆమె శిక్ష మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, సుదీర్ఘ కాలంపాటు తమ వర్గాన్ని శశికళ కాపాడే అవకాశాలు ఉన్నాయా? అన్నదానిపై దినకరన్ వర్గం తర్జన భర్జనలు పడుతోంది. 

  • Loading...

More Telugu News