: మసాజ్ మురికికీ టాలీవుడ్ టచ్... ఓ వ్యాంప్ పాత్రల నటి, మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేర్లు వెల్లడి!


టాలీవుడ్ ను కుదిపేసిన మాదకద్రవ్యాల వ్యవహారం నుంచి పూర్తిగా బయటపడక ముందే, మసాజ్ సెంటర్ల పేరిట ఖరీదైన వ్యభిచారం జరుగుతున్న ఉదంతం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఇక బాడీ మసాజ్ మురికికీ టాలీవుడ్ తో సంబంధాలు బయటపడ్డాయి. ఈ దందాలో కీలక సూత్రధారిగా పోలీసులు భావిస్తున్న సిద్ధార్థ్ అనే వ్యక్తి నుంచి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు ప్రముఖ నటీమణుల పేర్లతో పాటు పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టుల పేర్లు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది.

వీఐపీ కస్టమర్ల కోసం వెండితెరతో పాటు బుల్లితెరకు చెందిన అందమైన వారిని ఎంపిక చేసి సరఫరా చేసినట్టు కూడా సిద్ధార్థ్ వెల్లడించినట్టు సమాచారం. ఇక ఆయన నోటి నుంచి వచ్చిన పేర్లలో గతంలో వ్యభిచారం కేసులో అరెస్టయిన నటితో పాటు, వ్యాంప్ పాత్రలు చేసే మరో యువ నటి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక వీరిని విచారించేందుకు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కాగా, థాయ్ లాండ్, మకావూ తదితర ప్రాంతాల్లో లభించే ఆనందాన్ని నగరానికి పరిచయం చేసిన సిద్ధార్థ్, ఈశాన్య రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి అమ్మాయిలను తెచ్చి, వారితో వ్యభిచారం చేయిస్తూ పట్టుబడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News