: పన్నీరు, పళని విలీనం చెల్లదు... ప్రభుత్వాన్ని కూలదోస్తా.. నా దగ్గర 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు: దినకరన్
తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం విలీనం చెల్లదని ఆ పార్టీ నేత టీటీవీ దినకరన్ స్పష్టం చేశారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ, వారి విలీనం చెల్లదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి ఉదయం 10:30 గంటలకు గవర్నర్ అపాయింట్ మెంట్ కోరామని, గవర్నర్ ను కలిసి విలీనంపై ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు. తన వద్ద 25 మంది ఎమ్యెల్యేలు ఉన్నారని ఆయన తెలిపారు.
ప్రభుత్వం ఉంటుందో, ఊడుతుందో తాను చెప్పలేనని ఆయన అన్నారు. పదవిని కాపాడుకునేందుకు పన్నీర్, పళని కలిశారని ఆయన ఆరోపించారు. ఈ కలయిక పట్ల ఎమ్మెల్యేలు సుముఖంగా లేరని ఆయన చెప్పారు. పలువురు ఎమ్మెల్యేలు తమను సంప్రదించి, ఈ విలీనంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. గవర్నర్ ను కలిసిన తరువాత నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.