: పేరు, వేదిక మార్చుకోనున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు!


2015లో ఐపీఎల్ లో చోటుచేసుకున్న స్పాట్ ఫిక్సింగ్‌ కుంభకోణంలో రెండేళ్ల నిషేధానికి గురైన రాజస్థాన్ రాయల్స్ జట్టు పేరు మార్చుకునేందుకు బీసీసీఐకి వినతి పంపింది. రానున్న ఐపీఎల్ సీజన్ లో పునఃప్రవేశం చేయనున్న ఈ జట్టు పేరుతో పాటు జట్టు అధికారిక వేదికను కూడా మార్చుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు అనుమతి కోసం బీసీసీఐకి లేఖ రాసింది.

స్పాట్ ఫిక్సింగ్ కేసుతో జట్టు పరువు ప్రతిష్ఠలు మంటగలిశాయని భావించిన యాజమాన్యం, పేరు మార్పుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే తమకు సొంత స్టేడియంగా పేరొందిన జైపూర్ కలసి రావడం లేదని భావించడం వల్లే వేదికను కూడా మార్చుకోవాలని నిర్ణయించింది. మరోపక్క, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తమ అధికారిక వేదిక మొహాలీ నుంచి ఇండోర్ కు మారాలని నిర్ణయించింది. ఈ మేరకు బీసీసీఐని అనుమతి కోరింది. మొహాలీ తమకు కలసి రావడం లేదని, ఇండోర్ తో నైనా తమ జట్టు రాత మారుతుందని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ భావిస్తోంది. 

  • Loading...

More Telugu News