: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సమ్మయ్య కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి బొచ్చు సమ్మయ్య (71) సోమవారం మృతి చెందారు. ఈ నెల 9న హైదరాబాద్‌లోని తన నివాసంలో జారిపడడంతో తీవ్ర గాయాలపాలైన ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో సోమవారం కన్నుమూశారు. వరంగల్ జిల్లా పరకాలకు చెందిన సమ్మయ్య అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. పీవీ నరసింహారావు హయాంలో జాతీయ ఎస్సీఎస్టీ కమిషన్ సభ్యుడిగా వ్యవహరించారు. కాగా, నేడు (మంగళవారం) ఆయన స్వగ్రామం పరకాలలో అంత్యక్రియలు జరగనున్నాయి.