: ఈ నెల 26న అమరావతికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్యనాయుడు తొలిసారిగా ఏపీలో పర్యటించనున్నారు. ఈ నెల 26న ఆయన అమరావతికి వెళ్లనున్నారు. వెంకయ్యనాయుడు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను సంబంధిత అధికారులు ఈ రోజు ఖరారు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ, వెంకయ్యనాయుడు రాకను పురస్కరించుకుని 26న ఆత్మీయ సన్మానం చేయనున్నట్లు చెప్పారు. అనంతరం, రాష్ట్ర అర్బన్ హౌసింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని అన్నారు. సన్మానం అనంతరం, తెనాలిలో జరగనున్న పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొంటారని చెప్పారు.