: `రోబో 2.0` విడుదలపై స్పష్టతనిచ్చిన తరణ్ ఆదర్శ్!
రజనీ కాంత్ `రోబో 2.0` చిత్రం విడుదల ఏప్రిల్ 2018కి వాయిదా పడిందని వస్తున్న వార్తలపై సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ తెరదించారు. ఆ వార్తల్లో నిజం లేదని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. `రోబో 2.0 విడుదల ఏప్రిల్ 2018 అని వస్తున్న వార్తలు నిజం కాదు. జనవరి 25, 2018న తప్పకుండా `రోబో 2.0` ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇందులో రజనీ కాంత్, అక్షయ్ కుమార్‌లు నటించారు` అని ఆయన ట్వీట్ చేశారు. `రోబో` సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రానికి కూడా శంకర్ దర్శకత్వం వహించారు. అమీ జాక్సన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది.