: బిగ్ బాస్ టాస్క్: హీరోయిన్ అర్చన వీపెక్కిన ధనరాజ్!


ప్రముఖ సినీ నటి అర్చన, హాస్యనటుడు ధనరాజ్ బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. వీకెండ్ ఎపిసోడ్ సందర్భంగా ఈ షో వ్యాఖ్యాత జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో పలు ఆటలాడాడు. ఒక కంటెస్టెంట్ ను బోనులో నిలబెట్టి, మిగిలిన వారిలో ఒకరిని బౌల్ లోని చీటీలో ఉన్న పేరును బయటకు తీసి, బోనులోని వారు మార్చుకోవాల్సిన అవలక్షణాన్ని చెప్పాలని కోరాడు.

అనంతరం ఒక టాస్క్ ఇచ్చి, చీటీలో రాసి ఉన్న పని చేయమని జూనియర్ ఎన్టీఆర్ కోరాడు. అర్చనకు వచ్చిన చీటీలో బిగ్ బాస్ హౌస్ లోని ఎవరైనా ఓ వ్యక్తిని వీపుపై ఎక్కించుకుని (ఉప్పు మూట) హాల్ లోని సోఫా చుట్టూ రెండు రౌండ్లు తిరగాలని ఉంది. దీంతో బరువు తక్కువగా ఉండే ధనరాజ్ ను అర్చన తన వీపుపై ఎక్కించుకుని రెండు రౌండ్లు తిరిగింది. ఇది అందర్నీ ఆకట్టుకుంది. 

  • Loading...

More Telugu News