: రేపు బ్యాంకు సేవలు బంద్..! పని ఉంటే ఈ రోజే పూర్తి చేసుకోండి...


ఈ నెల 22న అంటే రేపు ప్రభుత్వరంగ బ్యాంకు సేవలు బంద్ కానున్నాయి. ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్ల సాధనకు మంగళవారం దేశవ్యాప్తంగా సమ్మె తలపెట్టాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనాలను వీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీరి సమ్మె కారణంగా సాధారణ బ్యాంకు సేవలకు తీవ్ర అంతరాయం కలగనుంది. ప్రైవేటు బ్యాంకులైన ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహింద్రా బ్యాంకు సేవలు మాత్రం యథావిధిగా పనిచేయనున్నాయి.

కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చిన రుణాలను మొండి బకాయిలుగా పరిగణించి రద్దు చేయాల్సిన అవసరం లేకుండా చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే, రుణ ఎగవేతను నేరపూరిత చర్యగా ప్రకటించాలని కోరుతున్నాయి. చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగిన చర్చల్లో అంగీకారం కుదరకపోవడంతో సమ్మె యథావిధిగా రేపు కొనసాగుతుందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి.

  • Loading...

More Telugu News