: గువామ్ దీవి మా లక్ష్యం కాదు... అమెరికాకు ఊహించని షాకిస్తాం!: ఉత్తరకొరియా తాజా ప్రకటన


ఫసిపిక్ తీరంలోని గువామ్ దీవి తమ లక్ష్యం కాదని ఉత్తరకొరియా స్పష్టం చేసింది. దక్షిణకొరియాతో అమెరికా సంయుక్త సైనిక విన్యాసాల నేపథ్యంలో ఉత్తరకొరియా అధికారిక పత్రిక రోడాండ్ సిమోన్ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. ఇందులో దక్షిణ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాలు ఆపేయాలని హెచ్చరించింది. లేదంటే అమెరికా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. గువామ్ పై దాడి చేస్తామని ప్రకటించినప్పటికీ దానిని విరమించుకున్నామని, అయితే తాము ఎక్కడ? ఎలా? ఎప్పుడు? దాడి చేస్తామో ఎవరూ ఊహించలేరని తెలిపింది.

అమెరికా ఏం చేస్తుందో గమనించిన తరువాత అణుదాడి చేద్దామని కిమ్ నిర్ణయించారని, అందుకే తాము దాడి చేయలేదని ఆ కథనం తెలిపింది. దీనిని అవకాశంగా తీసుకున్న అమెరికా తన ఆయుధ సంపత్తితో తమను భయపెట్టాలని చూసిందని, అది జరిగేపని కాదని తెలిపింది. అమెరికా ముందు తలవంచడమన్నది కలలో కూడా జరిగే పని కాదని ఆ పత్రిక స్పష్టం చేసింది. కాగా, ఉత్తరకొరియాపై నిఘా కోసం శక్తిమంతమైన కెమెరాలు, రాడార్లు, సెన్సర్లు కలిగిన ప్రత్యేక యుద్ధ విమానం 'డ్రాగన్ లేడీ'ని రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News