: వేషధారణ మార్చిన గద్దర్.. మార్పు తన నుంచే ప్రారంభమని పేర్కొన్న ప్రజాయుద్ధ నౌక!
చేతిలో కర్ర, భుజంపై గొంగడి, కాళ్లకు గజ్జెలతో నిత్యం దర్శనమిచ్చే ప్రజాయుద్ధ నౌక, టీమాస్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు గద్దర్ గెటప్ మార్చారు. ప్యాంటు, షర్టు, మెడలో టైతో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. తెలంగాణ ప్రజా సామాజిక సంఘాల ఐక్య వేదిక మహబూబ్‌నగర్ జిల్లా ఆవిర్భావ సభలో పాల్గొన్న ఆయన ఇలా సరికొత్త వేషధారణతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఐక్య వేదిక సభలో ఆయన మాట్లాడుతూ ఏళ్లు గడుస్తున్నా బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లోనూ మార్పు రావడం లేదని పేర్కొన్న ఆయన మార్పు తన నుంచే ప్రారంభం కావాలన్న ఉద్దేశంతోనే ఇలా వేషధారణ మార్చినట్టు చెప్పారు. ఇక నుంచి ప్రతి ఒక్కరూ మారాలని పిలుపునిచ్చారు.